ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఒక ఫొటో ఏకంగా రూ.1.3 కోట్లపైగా ధరకు అమ్ముడు పోయింది. మస్క్ కాలేజీలో చదువుకునే సమయంలో జెన్నిఫర్ గ్వైన్ అనే యువతితో ప్రేమాయణం సాగించాడు. 1994 నుంచి 1995 వరకు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు. తాజాగా వీళ్లకు సంబంధించిన కొన్ని వస్తువులు, ఫొటోలను బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్ వేలం వేసింది.
జెన్నిఫర్‌కు ఆ కాలంలో మస్క్ ఒక బంగారు నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీనికి వేలంలో 51 వేల డాలర్ల్ అంటే రూ.40 లక్షలపైగా వచ్చాయి. అలాగే మస్క్ ఆమెకు ఇచ్చిన ఒక బర్త్‌డే కార్డును కూడా రూ.13 లక్షలకు అమ్ముడుపోయింది. ఇవేకాక, మస్క్-జెన్నిఫర్ కలిసి ఉన్న 18 ఫొటోలను కూడా వేలం వేశారు.
వీటిలో మస్క్, జెన్నిఫర్ కలిసి ఉన్న ఒక ఫొటో ఏకంగా 1.65 లక్షల డాలర్ల (రూ.1.3 కోట్లకుపైగా) ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ట్విట్టర్‌తో మస్క్ లీగల్ వార్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల మస్క్ ఈ డీల్ నుంచి తప్పుకోగా.. అతను తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను కొనుగోలు చేయాల్సిందేనని ట్విట్టర్ యాజమాన్యం అంటోంది.