ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను తాను కొనేస్తానని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొంతకాలం క్రితం ప్రకటించారు. దీనికోసం 44 బిలియన్ డాలర్ల డీల్ కూడా చేసుకున్నాడు. అయితే ట్విట్టర్‌లోని బాట్స్, ఫేక్ ఖాతాల వివరాలు తనకు ఇవ్వాలని మస్క్ షరతు పెట్టాడు. దానికి ట్విట్టర్ బోర్డు అంగీకరించకపోవడంతో తను డీల్ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు మస్క్.
దీనిపై తాము కోర్టుకెక్కుతామని, ఎలాగైనా ఈ డీల్ జరిగేలా చూస్తామని ట్విట్టర్ పేర్కొంది. దీనిపై మస్క్ తనదైన స్టైల్లో స్పందించాడు. తన అధికారిక ఖాతాలో ఒక గ్రిడ్ ఫొటో షేర్ చేశాడు. మొదటి గ్రిడ్‌లో అతను నవ్వుతున్న ఫొటో పక్కనే ‘‘నేను ట్విట్టర్ కొనలేనని వాళ్లు అన్నారు’’ అని ఉంది.
రెండో గ్రిడ్‌లో కూడా అలాంటి ఫొటో పక్కన ‘‘తర్వాత, బాట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కుదరదరన్నారు’’ అనే వాక్యం ఉంది. మూడో గ్రిడ్‌లో ‘‘ఇప్పుడు, కోర్టుకెళ్లి నా చేత ట్విట్టర్ కొనిస్తానంటున్నారు’’ అనే వాక్యం పక్కనే మరో నవ్వుతున్న ఫొటో ఉంది. ప్రస్తుతం మస్క్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
— Elon Musk (@elonmusk) July 11, 2022