ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. యూట్యూబ్‌లో చాలా స్కామ్ యాడ్స్ ఉన్నాయని అంతకుముందే ట్వీట్ చేసిన మస్క్.. మరో మీమ్‌ను ట్వీట్ చేశాడు. యూట్యూబ్‌లో యాడ్స్ ఎక్కవగా రావడం.. ముఖ్యంగా వాటిలో స్కాం యాడ్స్ ఉండటంపై పలువురు యూజర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇలాంటి సమయంలో మస్క్ ఇలాంటి కామెంట్లు చేయడంతో.. నెటిజన్లు నిజమేనంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి యూట్యూబ్ కూడా కొనేయాలంటూ మస్క్‌కు సలహా ఇస్తున్నారు. ఇటీవలే ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే కొన్ని సమస్యల వల్ల ఈ డీల్ పూర్తికాలేదు. ముఖ్యంగా ఫేక్ అకౌంట్ల డేటా తనకు ఇవ్వడం లేదని, అది ఇవ్వకపోతే డీల్ జరగదని తాజాగా మస్క్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
YouTube seems to be nonstop scam ads
— Elon Musk (@elonmusk) June 7, 2022
— Elon Musk (@elonmusk) June 7, 2022