న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ప్రపంచ వ్యాప్తంగా విమాన రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. అనేక వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) ఓ సెటైర్ వేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఈ అంశంపై స్పందిస్తూ ఓ మీమ్‌కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్ అని కూడా మరో ట్వీట్ చేశారు.
2021లో చేసిన క్రిప్టిక్ ట్వీట్‌ను మస్క్ ఇవాళ మరోసారి రీట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో మైక్రోసాఫ్ట్ సంస్థను మాక్రోహార్డ్‌గా వర్ణించారు. ఇక ఇండియన్స్ ట్వీట్ చేసిన ఓ ట్వీట్‌కు నవ్వే ఎమోజీని పోస్టు చేశారు. ఆ ట్వీట్లో ఓ ఫోటోను పోస్టు చేశారు. అన్ని క్రాష్ అవుతున్నా.. ఎక్స్ మాత్రం ఇంకా ఫంక్షన్ చేస్తున్నట్లు ఆ ట్వీట్లో ఉంది.
— Elon Musk (@elonmusk) July 19, 2024
మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ 365 సర్వీసుల్లో సమస్యలు తలెత్తాయి. ఎయిర్‌లైన్స్, బ్యాంకులు, టెలికాం కంపెనీలు, టీవీ, రేడియో బ్రాడ్కాస్టర్లపై తీవ్ర ప్రభావం పడింది. విండోస్ వర్కస్టేషన్లలో స్క్రీన్లు అన్నీ ఎర్రర్ చూపించాయి. సమస్యను తగ్గించేందుకు ఇంపాక్ట్‌కు గురైన ట్రాఫిక్‌ను మరో సిస్టమ్‌కు మార్చనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది.
క్లౌడ్ సర్వీసుల్లో సమస్యల వల్ల స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్ సంస్థలకు చెందిన విమానాల బుకింగ్, చెక్ ఇన్, అప్డేట్స్ అన్నీ గల్లంతుఅయ్యాయి. అమెరికాకు చెందిన ఫ్రంటైర్ ఎయిర్‌లైన్స్ 147 విమానాలను రద్దు చేసింది. 200 విమానాలను ఆలస్యం చేసింది. సన్ కంట్రీ, ఎలిగంట్ సంస్థలు కూడా 50 శాతం వరకు విమానాలను రద్దు చేశాయి.
— Elon Musk (@elonmusk) July 19, 2024