వాషింగ్టన్, అక్టోబర్ 5: ఏదైనా సమాచారం సవివరంగా కావాలంటే అందరూ వెదికేది ‘వికీపీడియా’లోనే. ఇప్పుడు దీనికి పోటీగా అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ ‘గ్రోకిపీడియా’ను తీసుకొస్తున్నాడు. ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికతతో పనిచేసే దీని బీటా వెర్షన్ను మరికొద్ది రోజుల్లో (రెండు వారాల్లో) ప్రారంభిస్తున్నట్టు మస్క్ ప్రకటించారు.
దీనిపై ‘ఎక్స్’ యూజర్ పేర్కొన్న పలు విషయాల్ని మస్క్ రీట్వీట్ చేశారు. దీని ప్రకారం, అత్యంత కచ్చితమైన జ్ఞాన వనరుగా, పరిమితులు లేకుండా పని చేయటమే లక్ష్యంగా ‘గ్రోకిపీడియా’ ను తీసుకొస్తున్నట్టు సమాచారం. వికీపీడియాలోని అబద్ధాలను, అర్ధసత్యాలను కూడా ఇది సరి చేస్తుందని..ఎంట్రీలను తిరిగి రాస్తుందని నిపుణులు చెబుతున్నారు.