న్యూయార్క్ : రిహన్నా సూపర్ బౌల్ హాఫ్‌టైం పెర్ఫామెన్స్‌ను 80-92 ఏండ్ల వయసు కలిగిన బామ్మలు రీక్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ వీడియోను అర్కాడియా సీనియర్ లివింగ్ బౌలింగ్ గ్రీన్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట షేర్ అయినప్పటినుంచి 44,000కుపైగా వ్యూస్ లభించాయి.
జీవితంలో అలసిసొలసి అమెరికాలోని కెంటకీ ఎల్డర్స్ షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్న బామ్మలు ఈ పెర్ఫామెన్స్ అదరగొట్టారు. ఈ షార్ట్ క్లిప్‌లో 11 మంది వృద్ధ మహిళలు వైట్ డ్రెస్ ధరించి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లుగా దుమ్మురేపగా 87 ఏండ్ల దోరా మార్టిన్ రిహన్నను మరిపిస్తూ ఎరుపు రంగు డ్రెస్‌లో మెరిశారు.
ఆమె పాప్ స్టార్ సాంగ్ రూడ్ బాయ్‌కు లిప్ సింక్ ఇచ్చారు. రిహన్నాస్ హాఫ్ టైం షో అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. బామ్మల డ్యాన్స్ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వయసులోనూ ఈ అందమైన బామ్మలు చలాకీగా గడుపుతున్నారని ఓ యూజర్ కామెంట్ చేయగా బామ్మల డ్యాన్స్ వీడియో అద్భుతమని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :