కాన్బెర్రా: రాబోవు 70 సంవత్సరాల్లో ఎల్నినో, లానినో పరిణామాల్లో గణనీయంగా మార్పులు ఉంటాయని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయని వాతావరణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 21వ శతాబ్దం చివరకు వెళ్లేకొద్దీ ఎల్నినో, లానినో బలహీనపడే కంటే ముందు తర్వాతి ఇవి మరింత బలపడే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన వాతావరణ నమూనాల సిమ్యులేషన్ల ఫలితాల ఆధారంగా తర్వాతి 70 ఏండ్లలో ఎల్నినో, లానినోలో భారీ మార్పులు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటి ప్రభావాల కారణంగానే వర్షపాతం పెరుగుదల, తగ్గుదల విపరీతంగా మారవచ్చని అంచనా వేశారు.