న్యూఢిల్లీ: టిబెట్‌లోని (Tibet) జిజాంగ్ ప్రావిన్స్‌లో (Xizang Province) స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు జిజాంగ్‌లో (Xizang) భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడ్డారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
ఆఫ్రికన్ దేశమైన మొరాకోలో (Moracco) భూకంపం విలయం సృష్టించిన విషయం తెలిసిందే. 6.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ధాటికి ఇప్పటివరకు 2 వేలకుపైగా మంది మృత్యువాతపడ్డారు. మరో 2,059 మంది గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల తొలగింపు ఆలస్యమవుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, గత ఆరు దశాబ్దాల్లో సంభవించిన అతిపెద్ద విపత్తు ఇదేనని వెల్లడించారు.
An earthquake of magnitude 4.0 hit Xizang at 05:40 am today: National Center for Seismology pic.twitter.com/aEhfljjKkr
— ANI (@ANI) September 10, 2023