ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న క్వాడ్ సమావేశంపై చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమను అడ్డుకోవడానికే క్వాడ్ సమావేశం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసే మాత్రం ఈ కూటమి ఎప్పటికీ సక్సెస్ మాత్రం కాలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ స్పష్టం చేశారు. చైనాకు మోకాలడ్డడానికే క్వాడ్ సమావేశం జరిగిందన్నది మా భావన. ఈ సమావేశాన్ని ఓ సాధనంగా చేసుకుంటూ మాకు ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న ఏకీకరణను బలహీనపరచడానికి, కావాలనే ఇలా చేస్తున్నారు. అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా వేదికగా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి స్కాట్ మారిసన్ కూడా పాల్గొన్నారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసినందుకు ఆస్ట్రేలియాకు ధన్యవాదాలని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. క్వాడ్ నిబంధనలకు లోబడి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కొనసాగించాలని క్వాడ్ మంత్రులు నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సానుకూల ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హామీ ఇచ్చారు.