వాషింగ్టన్: వచ్చే సంవత్సరంలో భారత దేశంలో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన గురువారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, భారత దేశంతో వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో అణ్వస్త్ర నిర్మూలన జరగాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగల సత్తా అమెరికాకు ఉందన్నారు. అయితే, అలాంటి అవసరం లేదని చెప్పారు.భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ భారత్ పర్యటన గురించి ఎటువంటి సమాచారం లేదన్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే, మీడియాతో పంచుకుంటానని తెలిపారు.