Donald Trump |వాషింగ్టన్: అమెరికా డాలర్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ సృష్టించేందుకు ప్రయత్నించినా లేదా ఇతర కరెన్సీకి మద్దతు తెలిపినా వంద శాతం సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్ తదుపరి అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
ఆ దేశాలు అలాంటి ప్రయత్నాలు చేస్తే అద్భుతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో వస్తువులు అమ్ముకోవడానికి వీడ్కోలు చెప్పాల్సి వస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.