న్యూయార్క్: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన స్వింగ్ స్టేట్స్లో ప్రస్తుతం రిపబ్లికన్ల హవా నడుస్తోంది. ఆ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండో స్వింగ్ స్టేట్‌ను వశం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం నార్త్ కరోలినా తర్వాత జార్జియాలోనూ ట్రంప్ విక్టరీ కొట్టారు. 2020 ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ పగా వేసింది. 2016 ఎన్నికల తరహాలోనే ట్రంప్ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ట్రంప్, హ్యారిస్ మధ్య గ్యాప్ చాలా ఉన్నది. ఓ అంతర్జాతీయ మీడియా రిపోర్టు ప్రకారం.. ట్రంప్ 246, కమలా హ్యారిస్ 182 స్థానాలను కైవసం చేసుకున్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్లో రిపబ్లికన్ పార్టీ గెలవడంతో.. ఆ పార్టీ మద్దతుదారులు ఆనందోత్సహాలు తేలుతున్నారు. ఇక కమలా హ్యారిస్ పార్టీ మద్దతుదారులు ప్రస్తుతం ఉత్సవాలకు దూరంగా ఉన్నారు.
ఇప్పటి వరకు జరిగిన లెక్కింపు ప్రకారం ట్రంప్‌కు 51.2 శాతం, హ్యారిస్‌కు 47.2 శాతం ఓట్లు పోలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్తి ఫలితాలు వెలుబడేందుకు చాలా సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం అందుతున్న రిజల్ట్స్ ప్రకారం .. ట్రంప్ దిశగా ఓటర్లు మెగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక సేనేట్‌లో కూడా మళ్లీ రిపబ్లికన్ పార్టీ తమ ఆధిపత్యాన్ని చాటనున్నది. సేనేట్ను ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.