Donald Trump | మొన్న, నిన్న, నేడు.. శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయ్..!
Donald Trump : ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయనే వార్తల్ని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఖండించారు. టెహ్రాన్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అబద్దాలని పేర్కొన్న ట్రంప్.. ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నామని చెప్పారు.
Donald Trump : ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయనే వార్తల్ని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఖండించారు. టెహ్రాన్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అబద్దాలని పేర్కొన్న ట్రంప్.. ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నామని చెప్పారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అమెరికా మధ్య కొన్ని రోజులుగా శాంతి చర్చలు జరపడం లేదనే వార్తలన్నీ అవాస్తవాలే, అవన్నీ తప్పుడు కథనాలు అని మంగళవారం ట్రుత్ సోషల్ పోస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు స్పందించారు.
పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే విషయమై ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరండం లేదు. కాల్పుల విరమణ అంటూనే ఇరుదేశాలు ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రపంచాన్ని గందరగోళంలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు ఆగిపోయాయి అంటూ టెహ్రాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే.. అవన్నీ అబద్ధాలని, ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. నాలుగు రోజుల క్రితం చర్చలు జరిగాయి. మూడు రోజుల క్రితం, రెండు రోజుల క్రితం.. ఈరోజు కూడా ఇరుదేశాల ప్రతినిధులు మధ్య చర్చలు సాగాయి అని ట్రుత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

