వాషింగ్టన్: ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై కొత్త షరతు పెట్టారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump). సీజ్‌ఫైర్‌ను పర్మనెంట్‌గా కొనసాగించాలంటే హిజ్బుల్లాకు ఇరాన్ ఫండింగ్ ఆపాలన్నారు. ఓవల్ ఆఫీసులో ఆయన రిపోర్టర్లతో మాట్లాడారు. ఇరాన్ కచ్చితంగా ఫైనాన్సింగ్ ఆపాలన్నారు. మొన్నటి వరకు ఇరాన్ అణ్వాస్త్ర సామర్థ్యంపై చర్చల్లో ఫోకస్ పెట్టిన ట్రంప్ ఇప్పుడు హిజ్బుల్లా వైపు మళ్లారు. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆవన్.. రాబోయే కొన్ని వారాల్లో వాషింగ్టన్ రానున్నట్లు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్‌లో ఇద్దరూ కలుసుకుంటారని ఆయన చెప్పారు. అయితే నెతన్యహూతో లెబనాన్ అధ్యక్షుడు నిజంగా కలుస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇక ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణను మరో మూడు వారాలు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. వైట్‌హౌజ్‌లో రెండు వర్గాలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయిన తర్వాత ఆయన ఈ విషయాన్ని చెప్పారు. హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మద్య తొలి దశ చర్చలు ఏప్రిల్ 14వ తేదీన జరిగాయి. అయితే ఆ చర్చల తర్వాత 10 రోజుల పాటు సీజ్ఫైర్ ప్రకటించారు.