Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తున్నారు. ఇటీవలే వెనిజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి.. అక్కడి ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ట్రంప్.. ఈసారి దావోస్ సదస్సులో గ్రీన్లాండ్ను హస్తగతం చేసుకుంటామని తేల్చి చెప్పారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రపంచ నేతల ముందే తాము మంచుముక్కను మాత్రమే అడుగుతున్నామని, అది కూడా గ్రీన్లాండ్కు రక్షణకోసమేనని ఆయన అన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక సదస్సు సాక్షిగా ‘భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని నేనే ఆపాను’ అని ట్రంప్ పాత పాటే మళ్లీ పాడారు.
Trump addressed the world’s political and business leaders at the Davos Forum in Switzerland on Tuesday, speaking to the major economic and geopolitical challenges of the day and emphasizing the importance of international cooperation. pic.twitter.com/235wLwR4Cz
— AMERICA TIME (@americatime_) January 21, 2026
‘ఈ ప్రపంచంలో గ్రీన్లాండ్ను సురక్షింతంగా చూసుకోగల దేశం అమెరికా మాత్రమే. వ్యూహాత్మక స్థావరమైన ఈ దేశాన్ని మేము కొనేందుకు సిద్దంగా ఉన్నాం. మా ప్రతిపాదనకు అవును, కాదు అని ఎంతమంది చెబుతారు. ఏదిఏమైనా అమెరికా మాత్రం గ్రీన్లాండ్ను వదులుకోదు. ఇక నాటోకు మేము చాలా నిధులు ఇస్తున్నాం. కానీ, బదులుగా మెరికాకు ఏమాత్రం లబ్ది చేకూరడం లేదు. యూరప్ సరైన మార్గంలో వెళ్లడం లేదు. కానీ, యూరప్ సంరక్షణకు అమెరికా ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుంది. అయితే.. వామపక్ష విధానాల కారణంగా యూరప్ శక్తిసామర్ధ్యాలు దారుణంగా తగ్గిపోయాయి. గ్రీన్ ఎనర్జీ, భారీగా వలసలు.. ఆ ప్రాంతాన్ని ఘోరంగా దెబ్బతీశాయి’ అని ట్రంప్ వెల్లడించారు.