Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తర్వాత పాలనలో దూకుడు కనబరుస్తున్న ట్రంప్ సోమవారం మరో సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ(Washington DC)ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.
శాంతి భద్రతలను కాపాడాలనే లక్ష్యంతో నగరంలో భారీగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను మోహరిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఓవైపు వాషింగ్టన్ డీసీలో నేరాల శాతం భారీగా తగ్గిపోయిందని పలు నివేదికలు చెబుతున్న అధ్యక్షుడు మాత్రం లా అండ్ ఆర్డర్ కోసమని పోలీసులను మోహరించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
HAPPENING NOW: Protesters have gathered in DC as Donald Trump attempts to take over the city with the National Guard to distract Americans from the Epstein Files (Video: @ScooterCasterNY) pic.twitter.com/4neq9E7dmI
— Marco Foster (@MarcoFoster_) August 11, 2025
రక్షణ శాఖ సెక్రటరీ పీటె హెగ్‌సేథ్, అటార్నీ జనరల్ పామ్ బొందిలతో పాటు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ట్రంప్. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ప్రజల రక్షణ కోసం వాషింగ్టన్ డీసీలో జాతీయ భద్రతా దళాలను మోహరిస్తున్నాను. ఒకవేళ పోలీసులను రంగంలోకి దించకుంటే మన రాజధాని హింసాత్మక గ్యాంగులు, రక్తం మరిగిన నేరస్థులు చేతుల్లోకి వెళుతోంది. అందుకే 800 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను నియమిస్తున్నాను. వీళ్లు స్థానిక, సమాఖ్య చట్టాల అమలులో కీలక పాత్ర పోషిస్తారు అని ట్రంప్ విలేకరులతో వెల్లడించారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన డిఫెన్స్ సెక్రటరీ హెగ్‌సేథ్ మాట్లాడుతూ… వచ్చే వారంలోనే ఈ దళాలు రాజధాని చేరుకుంటాయని పేర్కొన్నారు.