Donald Trump | వాషింగ్టన్, ఫిబ్రవరి 10: పాలస్తీనియన్లకు గాజాకు తిరిగి వచ్చే హక్కు ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘గాజాను స్వాధీనం చేసుకుంటాం. నా ప్రణాళిక ప్రకారం.. పాలస్తీనియన్లు నివసించేందుకు గాజా బయట ఆరు ప్రాంతాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. పాలస్తీనియన్లను గాజాకు తిరిగి వచ్చేందుకు అనుమతిస్తారా? అని ప్రశ్నించగా.. లేదు, వారికి ఎలాంటి హక్కు ఉండదు అని స్పష్టంచేశారు.