మాస్కో: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ భద్రత గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కజకిస్తాన్‌లో జరిగిన ఓ సదస్సుకు హాజరైన పుతిన్ మీడియాతో మాట్లాడుతూ, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరిగిన తీరు తనను షాక్‌కు గురి చేసిందని అన్నారు.
‘అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు వ్యతిరేకంగా..పూర్తిగా అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. ఒకటికి మించి హత్యాయత్నాలు జరిగాయి. వాటి నుంచి బయటపడ్డా..ఇప్పటికీ ఆయన సురక్షితంగా లేరన్నది నా అభిప్రాయం. దీనిపై ట్రంప్ జాగ్రత్తగా ఉంటారనే భావిస్తున్నా’ అని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికాతో చర్చించేందుకు సిద్ధమన్నారు.