నా ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించండి.. కోర్టుకెక్కిన ట్రంప్

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించాలంటూ కోర్టుకెక్కారు. ఈ ఏడాది జనవరిలో యూఎస్ కాపిటల్‌పై ట్రంప్ అభిమానుల దాడి తర్వాత ఆయన అకౌంట్‌ను ట్విటర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సస్పెన్షన్‌ను ఎత్తేయాలని కోరుతూ ట్రంప్ లాయర్లు శుక్రవారం మియామీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్విటర్, ఆ సంస్థ సీఈవో జాక్ డోర్సీపై ప్రాథమిక ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ వాళ్లు కోరారు. ట్రంప్‌ను అడ్డుకుంటూ ఆయన ఫస్ట్ అమెండ్మెంట్ హక్కులను ట్విటర్ ఉల్లంఘిస్తోందంటూ ట్రంప్ తరఫు లాయర్లు వాదిస్తున్నారు.
ఈ పిటిషన్‌పై ట్విటర్ స్పందించలేదు. ఎన్నికల్లో బైడెన్ అక్రమంగా విజయం సాధించారంటూ కాపిటల్ హిల్‌పై ట్రంప్ అభిమానులు దాడి చేసిన తర్వాత ఆయనపై ట్విటర్ శాశ్వత నిషేధం విధించింది. ఆయన భవిష్యత్తులోనూ ఇలాంటి హింసను ప్రేరేపిస్తారంటూ ట్విటర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఆరోపణలపైనే ఫేస్బుక్, యూట్యూబ్ కూడా ట్రంప్‌పై నిషేధం విధించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

