వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీచేశారు. ఇరాన్ ఇకపై మంచివాడితో వ్యహరించబోదని ఆయన ప్రకటించారు. ఇరాన్ కూడా తన పద్ధతి మార్చుకోవాలని, త్వరగా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికతోపాటు తన ఎడిట్ చేసిన చిత్రాన్ని కూడా ట్రంప్ జత చేశారు.
ఇరాన్ సక్రమంగా ప్రవర్తించలేక పోతున్నది. అణ్వస్త్ర రహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో వారికి తెలియదు. వారు త్వరగా బుద్ధి తెచ్చుకుంటే మంచిది అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ట్రంప్ షేర్ చేసిన ఫొటోలో ఆయన ఒక అసాల్ట్ రైఫిల్‌ను పట్టుకుని కనిపిస్తున్నారు.