Donald Trump | తుఫాను వస్తున్నది.. ఏదీ ఆపలేదు.. ట్రంప్ పోస్టుపై జోరుగా ఊహాగానాలు
Donald Trump | కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంలో ఇరాన్ విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు కొత్త ఊహాగానాలకు తెరతీసింది.
Donald Trump | వాషింగ్టన్, ఏప్రిల్ 30: కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంలో ఇరాన్ విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఏఐ సృష్టించిన ఒక ఫొటోను పంచుకుంటూ తుఫాను వస్తున్నది. దాన్ని ఏదీ ఆపలేదు అనే సందేశాన్ని జతచేశారు. ట్రంప్ పెట్టిన పోస్టులోని మర్మం తెలియనప్పటికీ ఆయన ఇరాన్‌ను ఉద్దేశించే ఈ హెచ్చరిక జారీచేసి ఉంటారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.
ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఖరారు కాకపోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న సూచనలు అందచేసేందుకే ట్రంప్ ఈ పోస్టు పెట్టి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఆక్సియోస్ వార్తాసంస్థ కథనం ప్రకారం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని కీలక మౌలిక సదుపాయాలతో శక్తివంతమైన దాడులు జరిపేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సైనిక ప్రత్యామ్నాయాల గురించి సెంట్రల్ కమాండ్ అధిపతి బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ గురువారం (ఏప్రిల్ 30) భేటీ కానున్నట్లు వార్తాసంస్థ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

