వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. ఏడు యుద్ధాలను ఆపానని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు మాత్రం మూడు యుద్ధాలను ఆపానని చెప్పారు. వైట్ హౌస్లో జరిగిన టాప్ టెక్ కంపెనీల సీఈవోల విందు సమావేశంలో ఆయన మాటల్లో మార్పు కనిపించింది. మూడు దశాబ్దాలకుపైగా జరుగుతున్న మూడు యుద్ధాలను తాను ఆపానని చెప్పారు.
వీటిలో మొదటిది, 31 ఏళ్ల నుంచి జరుగుతున్నదని, దీనిలో కోటి మంది మరణించారని చెప్పారు. రెండోది 31 ఏళ్ల నుంచి, మూడోది 34 ఏళ్ల నుంచి జరుగుతున్నదన్నారు. “వీటిని పరిష్కరించలేవని చాలా మంది అన్నారు. కానీ నేను పరిష్కరించాను” అని చెప్పారు.