న్యూఢిల్లీ: జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ సైంటిస్ట్, నోబెల్ గ్రహీత జేమ్స్ డీ వాట్సన్(97) శుక్రవారం తుది శ్వాస విడిచారు. న్యూయార్క్‌లోని ఈస్ట్ నార్త్ పోర్ట్‌లో గురువారం కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు డంకన్ వాట్సన్ తెలియజేశారు. కేవలం 25 ఏండ్ల వయసులో మరో ఇద్దరు సైంటిస్టులతో కలిసి డీఎన్ఏ డబుల్ హెలికల్ నమూనాను(1954లో) ప్రతిపాదించారు.
ఇది వంశపారంపర్య సమాచారాన్ని తరాల మధ్య బదిలీ చేయడానికి అనుమతించే పరమాణు నిర్మాణాన్ని వెల్లడించింది. దీంతో ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సైంటిస్టుగా జేమ్స్ వాట్సన్ గుర్తింపు అందుకున్నారు. 20వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణగా ఇది నిలిచింది.