లాస్ ఏంజెలెస్: యానిమేటింగ్ వరల్డ్‌లో దిగ్గజ కంపెనీ అయిన వాల్డ్ డిస్నీ కంపెనీ.. సుమారు 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఆన్లైన్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా చేసుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది.
ఈ చర్యతో 5.5 బిలియన్ డాలర్లను ఆదా చేసుకొంటున్నట్టు తెలిపింది. తొలగించిన ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3.6 శాతమని డిస్నీ పేర్కొన్నది. ఐదేండ్లలో డిస్నీ ఉద్యోగులను తొలగించడం ఇది ఐదోసారి.