Chandrayaan-3 | పాకిస్థాన్ పత్రికల మొదటి పేజీలో ‘చంద్రయాన్-3’ చారిత్రక విజయం
Chandrayaan-3 | దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా లేవు. అయినప్పటికీ ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) చారిత్రక విజయాన్ని ఆ దేశంలోని ప్రధాన పత్రికలు మొదటి పేజీలో కవరేజ్ ఇచ్చాయి.
ఇస్లామాబాద్: దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా లేవు. అయినప్పటికీ ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) చారిత్రక విజయాన్ని ఆ దేశంలోని ప్రధాన పత్రికలు మొదటి పేజీలో కవరేజ్ ఇచ్చాయి. ‘చంద్రుని దక్షిణ ధృవంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అవతరించింది’ అని పాకిస్థాన్‌కు చెందిన చాలా వార్తాపత్రికలు, న్యూస్ వెబ్సైట్లు తమ హెడ్‌లైన్స్‌లో పేర్కొన్నాయి. ‘చంద్రయాన్-3 చివరకు చంద్రుడిపై దిగింది’ అన్న పేరుతో పాకిస్థాన్ జియో న్యూస్ ఒక కథనాన్ని ప్రచురించింది. అలాగే పాకిస్థాన్‌కు చెందిన న్యూస్ ఇంటర్నేషనల్, డాన్ వార్తాపత్రిక, బిజినెస్ రికార్డర్, దునియా న్యూస్ వంటివి కూడా ‘చంద్రయాన్-3’ సక్సెస్ గురించి వివిధ అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా సేకరించిన కథనాలను అందించాయి.
కాగా, పాకిస్థాన్ మీడియానే కాదు ఆ దేశ చట్టసభ్యులు కూడా భారత్ సాధించిన ఈ ఘనతను కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి ఇది గొప్ప క్షణం అని, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి అన్నారు. ఈ విజయం పట్ల భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. అలాగే దీనికి ముందు చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ లైవ్ కవరేజ్ ఇవ్వాలని పాకిస్థాన్ మీడియాను కూడా ఆయన కోరారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా టాప్ మీడియా సంస్థలు కూడా ‘చంద్రయాన్-3’ విజయాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

