న్యూఢిల్లీ: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. దీంతో విమానాన్ని రోమ్కు మళ్లించారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఏ 292 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఈనెల 22న రాత్రి 8.14 గంటలకు బయల్దేరింది. కాస్పియన్ సముద్రం దాటిన తర్వాత బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో తనిఖీల కోసం రోమ్‌లో దించాలని అధికారులు ఆదేశించడంతో ఆదివారం సాయంత్రం అక్కడి లియోనార్డో డా విన్సీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
ఇటలీ వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ రక్షణగా వస్తుండగా రోమ్‌లో సురక్షితంగా దిగిందని, ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానంలోని 199 మంది క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రొటోకాల్ ప్రకారం తనిఖీల తర్వాత ఢిల్లీకి బయల్దేరుతుందని పేర్కొంది. రోమ్‌లో విమానం దిగిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
🚨 INSIDE THE ESCORT MISSION: This stunning footage from an Italian Air Force Eurofighter shows American Airlines #AA292 intercepted mid-air and escorted to Rome-Fiumicino after a bomb threat forced an emergency diversion.
🎥 Must-see footage ⬇️ #AA292 #Breaking NewYork-Delhi pic.twitter.com/rTTdQiLIAY
— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) February 23, 2025
Friends deplaning from AA292 in Rome earlier today after a bomb threat was made over the Caspian Sea. The flight landed while escorted by Italian fighter jets. American airlines 292 is safely on the ground all passengers safe. pic.twitter.com/sXgUAB53iK
— Herbert Hildebrandt (@herberandt) February 23, 2025
🎥 MISSION COMPLETE: Watch as Italian Air Force Eurofighters return to base after successfully escorting American Airlines #AA292 to Rome-Fiumicino following a mid-air bomb threat.
The high-security operation ensured a safe landing, with all passengers and crew unharmed. https://t.co/7Ohu1VHv8Z pic.twitter.com/bYSd9YtJUQ
— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) February 23, 2025