అంకారా: తుర్కియే, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 24 వేలు దాటింది. శిథిలాను తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే భూకంపం సంభవించి 104 గంటలు గడుస్తున్నప్పటికీ కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. దీంతో సహాక సిబ్బంది ముమ్మరంగా శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తుర్కియేలో శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా క్షేమంగా బయటపడ్డారు. అయితే తీవ్రమైన చలి, ఆకలి కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా, కిరిఖాన్ పట్టణంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న జైనెప్ కహ్రామన్ అనే 40 ఏండ్ల మహిళను జర్మనీ, తుర్కియో సహాయక బృంధాలు క్షమంగా బయటకు తీశారు. అదేవిధంగా నాలుగు రోజులుగా తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేకపోయిన ప్రాణాలు నిలుపుకున్న అదియామన్ అనే నాలుగేండ్ల చిన్నారిని, మరో పదేండ్ల చిన్నారిని, 17 ఏండ్ల మహమ్మద్ కోర్కుట్ అనే యువకుడిని సురక్షితంగా బయటకుతీశారు.
ఇస్కెందెరన్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవన శిథిలాల్లో 9 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఆరుగురిని రక్షించగా, మరో ముగ్గురిని బయటకు తీసుకురావడానికి యత్నిస్తున్నారు.
Zeynep Kahraman had been trapped under a mountain of concrete for five days in Turkey after a deadly earthquake struck the region. Her sister and the teams of German and Turkish rescuers tell her story of survival https://t.co/QoemWG5wkT pic.twitter.com/CqYpQr3wQp
— Reuters (@Reuters) February 11, 2023
భూకంపం వల్ల సిరియాలో 50 లక్షలకుపైగా నిరాశ్రయులు అయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అదిధంగా 8.7 లక్షల మంది ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపింది.
#UPDATE Here is the latest on the situation in quake-hit Turkey and Syria:
➡️ Combined death toll nearing 24,000
➡️ UN says 870,000 in urgent need of food
➡️ In Syria alone, up to 5.3 mln people may have been made homelesshttps://t.co/5vZ87DzVAi @FulyaOzerkan @RemiBanet pic.twitter.com/PzSh36J0W5— AFP News Agency (@AFP) February 10, 2023