Death toll : పొరుగు దేశం నేపాల్ (Nepal) లో అవినీతి (Curruption) కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతుల సంఖ్య (Death toll) 51కి పెరిగింది. వారిలో 30 మంది బుల్లెట్ గాయాల (Bullet wounds) తో మరణించిన వారు ఉన్నారు. మిగతా 21 మంది మంటలు అంటుకుని, ఇతర గాయాలతో మరణించారు. మృతుల్లో పౌరులతోపాటు పోలీసులు కూడా ఉన్నారు. నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Nepal health ministry) శుక్రవారం మధ్యాహ్నం ఈ వివరాలను వెల్లడించింది.
కాగా, నేపాల్ రాజధాని ఖాట్మండులో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. దాంతో కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించే కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలో ఆస్పత్రి పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా వందల మంది గాయాలతో చికిత్స పొందుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
#WATCH | Nepal: The process of handing over the bodies of those who died in the anti-corruption protest begins after autopsy.
Visuals from a hospital in Kathmandu. pic.twitter.com/Hgkc7YQ5fE
— ANI (@ANI) September 12, 2025