డేర్ అల్ బలాహ్ : హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన సుమారు రెండేండ్ల కాలంలో ఇజ్రాయెల్ మిలిటరీ చేతిలో గాజాలో 56 వేల మందికి పైగా మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2023, అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న దాడుల్లో 56,077 మంది మరణించారని, 1,31,848 మంది గాయపడ్డారని తెలిపింది.
రెండింటి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మార్చి 18 తర్వాత జరిగిన దాడుల్లో 5,759 మంది మరణించారని పేర్కొన్నది.