blast in Pakistan | పాకిస్థాన్ క్వెట్టాలో భారీ పేలుడు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు
Deadly blast | పార్క్ చేసిన యాక్టింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారి వాహనాన్ని టార్గెట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి షఫ్కత్ చీమా రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఆ అధికారి వాహనం వెనుక పార్క్ చేసిన మోటార్ బైక్‌లో పేలుడు పదార్థం అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో సోమవారం భారీ పేలుడు (Deadly blast) సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. మార్కెట్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగినట్లు సమాచారం. కాందహరి బజార్లో పార్క్ చేసిన యాక్టింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారి వాహనాన్ని టార్గెట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి షఫ్కత్ చీమా రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఆ అధికారి వాహనం వెనుక పార్క్ చేసిన మోటార్ బైక్‌లో పేలుడు పదార్థం అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ సంఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు వెల్లడించారు.
మరోవైపు సివిల్ ఆసుపత్రికి నాలుగు మృతదేహాలను తరలించారని, గాయపడిన ఎనిమిది మందిని అడ్మిట్ చేశారని క్వెట్టా ఆసుపత్రి ప్రతినిధి వాసిమ్ బేగ్ తెలిపారు. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదని పోలీసు అధికారి తెలిపారు. కాగా, దేశం నుంచి అన్ని రకాల ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం రెండు రోజులకు ఈ పేలుడు సంభవించింది.
Visuals from my town #Quetta as some unidentified group targets a Police Vehicle due to which several people injured.
More details awaited 💔#Baloch #Balochistan #Pakistan #QuettaBlast pic.twitter.com/XKJ9k2OPs0— Zahira Baloch (@ZahiraBaloch) April 10, 2023
Also Read:
Imran Khan | భారత్‌లా మేం కూడా రష్యా క్రూడ్ ఆయిల్‌ను చౌకగా కొనాలనుకున్నాం.. కానీ, : ఇమ్రాన్ ఖాన్
China Strikes: మిస్సైళ్లతో యుద్ధ విమానాలు.. తైవాన్ గగనతలాన్ని కమ్మేసిన చైనా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

