Imran Khan | భారత్‌లా మేం కూడా రష్యా క్రూడ్ ఆయిల్‌ను చౌకగా కొనాలనుకున్నాం.. కానీ, : ఇమ్రాన్ ఖాన్
Imran Khan | భారత్ (India)పై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి (Former Pakistan Prime Minister ), తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ చీఫ్ (Tehreek-e-Insaf chief) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు.
Imran Khan | భారత్ (India)పై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి (Former Pakistan Prime Minister ), తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ చీఫ్ (Tehreek-e-Insaf chief) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ మాదిరిగానే రష్యా క్రూడ్ ఆయిల్ (Russian Crude Oil)ను తాము కూడా చౌకగా పొందాలని కోరుకున్నాం కానీ, అవిశ్వాసంలో తన ప్రభుత్వం కూలిపోవడంతో అది సాధ్యంకాలేదని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
‘భారత్ లాగా రష్యా నుంచి మేం కూడా చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకోవాలనుకున్నాం. కానీ అది సాధ్యంకాలేదు. ఈ విషయంలో పాక్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అవిశ్వాస తీర్మానంలో నా ప్రభుత్వం ఓడిపోవడంతో చౌకగా చమురు దిగుమతి సాధ్యపడలేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు గతంలో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా (Russia)లో పర్యటించిన విషయం తెలిసిందే. దాదాపు 23 ఏండ్ల తర్వాత రష్యాలో ఓ పాక్ ప్రధాని పర్యటించడం అదే తొలిసారి. అయితే.. ఆ పర్యటనలో రష్యాతో పాక్ కొన్ని ఒప్పందాలు కూదుర్చుకోవాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. ఆ ఒప్పందాల్లో చౌకగా ముడి చమురు దిగుమతి కూడా ఒకటి.
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే పాకిస్థానీ కరెన్సీ విలువ అసాధారణ రీతిలో పతనమైంది. దీంతో అక్కడ నిత్యావసర ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. పాలు, పండ్లు, కూరగాయలు, చికెన్, చిరుధాన్యాలు సహా అన్ని ఆహార ధరలు ఆసాధారణ రీతిలో పెరిగిపోయాయి. ఎంతలా అంటే రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష విరమణకు పండ్లు కూడా కొనుక్కోలేని స్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Also Read..
Twitter | ‘W’ అక్షరాన్ని తొలగించలేదు.. రంగు వేశాం : ఎలాన్ మస్క్
Nationwide Drill | దేశవ్యాప్తంగా నేటి నుంచి రెండు రోజుల పాటు కొవిడ్ మాక్‌డ్రిల్స్
Himanta Biswa Sarma | రాహుల్‌పై పరువు నష్టం దావా వేస్తా : అస్సాం సీఎం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

