కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా సిరిల్ రామాఫోసా మరోసారి ఎన్నికయ్యే అవకాశం ఉన్నది. ఆయన నేతృత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కి దేశంలోని రెండో అతి పెద్ద పార్టీ డెమొక్రాటిక్ అలయెన్స్ (డీఏ) మద్దతు పలికింది. ఈ రెండు పార్టీలకు పార్లమెంటులో అత్యధిక ఎంపీల బలం ఉంది.