కొలంబో: శ్రీలంకను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 56 మంది మృతి చెందగా, 21 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేశారు.
వరద విపత్తులో చిక్కుకున్న శ్రీలంకకు ఆపరేషన్ సాగర్ బంధు కింద భారత్ మానవతా సాయం అందించింది.