Khaleda Zia | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former premier), బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చైర్పర్సన్ ఖలీదా జియా (Khaleda Zia) ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తాజాగా తెలిపారు. ఖలీదాను సీసీయూ (Coronary care unit) యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
80 ఏండ్ల ఖలీదా నవంబర్ 23న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతీ ఇన్ఫెక్షన్తో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని పార్టీ నేతలు వెల్లడించారు.
కాగా, 2018లో అవినీతి కేసులో ఖలీదాకు అప్పటి ప్రభుత్వం 17 ఏళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో.. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలీదా జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కార్యనిర్వాహక ఉత్తర్వులతో విడుదల చేశారు. అంతకుముందు, లండన్‌లో నాలుగు నెలల పాటు వైద్య చికిత్స తీసుకుని ఆమె ఈ ఏడాది మే నెలలోనే ఢాకాకు తిరిగి వచ్చారు. ఇప్పుడు మరోసారి ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read..
Indonesia: ఇండోనేషియాలో 442కు చేరిన మృతుల సంఖ్య
Elon Musk | నా జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు.. కుమారుని పేరు శేఖర్: టెస్లా సీఈఓ మస్క్