బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్‌లో ఇవాళ ఉదయం రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. బ్యాంకాక్ నుంచి ఈశాన్య దిశగా వెళ్తున్న ఓ రైలుపై క్రేన్ పడింది. ఓ బోగీపై క్రేన్ పడిపోవడంతో.. ఆ రైలు పట్టాలు తప్పింది. ఆ బోగీలో ఉన్న ప్రయాణికుల్లో 22 మంది మృతిచెందారు. సుమారు 30 మంది గాయపడ్డారు.నాకాన్ రచ్చసీమ ప్రావిన్సులోని సిఖోయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉబాన్ రచ్చతాని ప్రావిన్సుకు ఆ రైలు వెళ్తున్నది. హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న భారీ క్రేన్.. ప్యాసింజర్ రైలుపై పడింది. ఈ ఘటన వల్ల రైలు పట్టాలు తప్పింది. ఆ తర్వాత అగ్ని అంటుకున్నది. ప్రస్తుతం మంటల్ని ఆర్పేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Construction crane for high-speed rail bridge collapsed onto moving passenger train in Sikhiu, Nakhon Ratchasima this morning (14 Jan) at 9:05 am. Train derailed and caught fire. 30+ passengers injured, many trapped in carriages. Multiple rescue teams deployed. pic.twitter.com/X4c0vyQIwA
— PR Thai Government (@prdthailand) January 14, 2026