న్యూయార్క్, మార్చి 29: కేవలం 10 సెకండ్లలో కొవిడ్ లేదా ఏదైనా ఫ్లూ వైరస్‌ను గుర్తించే అతి సన్నని సెన్సర్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. దగ్గు, గొంతు నొప్పి, తదితర లక్షణాలతో ఆందోళన చెందే వారికి ఇది సాయపడుతుందని తెలిపారు. ఈ సెన్సర్ డివైజ్‌ను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు సింగిల్ ఆటమ్ థిక్ నానో మెటీరియల్‌ను ఉపయోగించారు. వైరస్ ప్రభావం ప్రారంభ దశలో లేదా తక్కువగా ఉన్నప్పటికీ ఇది గుర్తిస్తుందని తెలిపారు.