Covid 19 XEC | ప్రపంచాన్ని మరోసారి కరోనా మహమ్మారి వణికిస్తున్నది. వరుసగా రెండు సంవత్సరాలపాటు కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకువచ్చిన ఈ మహమ్మారి కోట్లాది మందిని బలి తీసుకున్నది. ముప్పు తప్పిందని అంతా భావిస్తుండగా.. రూపు మార్చుకొని వచ్చి మరోసారి ఇబ్బంది పెడుతున్నది. ఇటీవల ఆఫ్రికా సహా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎస్ఈసీ (XEC)తో వేగంగా కేసులు పెరుగుతున్నాయని.. ఇప్పటికే దాదాపు 27దేశాల్లో కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్ఈసీ వేరియంట్‌తో తొలిసారిగా జూన్‌లో జర్మనీలో గుర్తించారు.
తాజాగా యూకే, యూఎస్, డెన్మార్ సహా పలు దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ఈ వేరియంట్ రూపాంతరం చెంది మరింత మరింత వేగంగా వ్యాపించేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐరోపాలో వైరస్ వేగంగా పెరుగుతోందని.. ఈ క్రమంలో ఇతర దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్ఈసీ వేరియంట్లో కొన్ని మ్యుటేషన్స్ కనిపించాయని నిపుణులు పేర్కొన్నారు. కాలిఫోర్నియాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ.. ఎక్స్ఈసీ వేరియంట్ ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆగస్టులో అనేక యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ వేరియంట్ నుంచి ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు.
దేశంలో కొవిడ్ కేసుల నమూనాల్లో 10శాతానికిపైగా కొత్త వేరియట్‌ను గుర్తించారు. వేరియంట్ వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు చెప్పారు. ఎక్స్ఈసీ కొత్త వేరియంట్ కావడంతో.. శాస్త్రవేత్తల వద్ద పెద్దగా సమాచారం లేదని చెప్పారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేఎస్.1.1, కేపీ3.3 హైబ్రిడ్ రూపమని.. ప్రాథమిక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులు భారత్‌లోనూ కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి చెందడానికి ఓమిక్రాన్ మరియు, సబ్ వేరియంట్స్ ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఒమిక్రాన్ అన్ని వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్లుగా గుర్తించినా.. అయితే, ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తెలిపారు. కొత్త వేరియంట్‌తో రిస్క్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఎక్స్ఈసీ వేరయింట్ కేసులు ఇప్పటి వరకు పోలాండ్, నార్వే, లక్సెంబర్గ్, ఉక్రెయిన్, పోర్చుగల్, చైనాతో సహా 27 దేశాల్లో 500 కంటే ఎక్కువ నమూనాల్లో గుర్తించారు. డాక్టర్ టోపోల్ మాట్లాడుతూ కరోనా కేసులు వేగంగా పెరగడం ప్రమాదకరమన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ టీకా, రోగనిరోధక శక్తిని సైతం తప్పించుకున్నాయన్నారు. సంక్రమణ ప్రమాదం బలహీనమైన రోగనిరోధశక్తి ఉన్న వారిలో సమస్యలను పెంచుతుందని.. టీకాలు ఇప్పటికీ తీవ్రమైన కేసులను నిరోధించడంలో సహాయపడుతాయన్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు మరొక బూస్టర్ షాట్ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
కొత్త వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతునొప్పి, దగ్గు, వాసన రాకపోవడం, ఆకలి మందగించడం, శరీరంలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ ఇతర ఇటీవలి కొవిడ్ వేరియంట్ల కంటే ఎక్స్ఈసీ కొంచెం ఎక్కువగా సోకే ప్రమాదం ఉందన్నారు. టీకాలు వేయడంతో పాటు కొవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడంతో పాటు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
Union Minister | కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూపై ఎఫ్ఐఆర్ నమోదు