RG Kar’s ex-principal | బెంగాల్ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ రిజిస్ట్రేషన్ రద్దు
RG Kar's ex-principal | పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ (RG Kar’s ex-principal) డాక్టర్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కస్టడీలో ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్‌ను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల జాబితా నుంచి తొలగించినట్లు డబ్ల్యూబీఎంసీ తెలిపింది. బెంగాల్ మెడికల్ యాక్ట్ 1914 నిబంధనల ప్రకారం ఆయన లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొంది.
కాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ)ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గతంలో కోరింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూబీఎంసీ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 7న ఘోష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సందీప్ ఘోష్ ఈ నోటీస్‌కు స్పందించలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ మెడికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు డబ్ల్యూబీఎంసీ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

