కిన్షస: వాయవ్య కాంగోలో ఈ వారంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించగా, పలువురి ఆచూకీ తెలియడం లేదు. ఈక్వెటోర్ ప్రావిన్స్‌లో బుధ, గురువారాల్లో ఈ ప్రమాదాలు జరిగాయని కాంగో ప్రభుత్వం తెలిపింది. కాంగో నది వెంబడి గురువారం సాయంత్రం దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ అగ్ని ప్రమాదానికి గురైంది.
వీరిలో 209 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. బసన్కుసు టెరిటరీలో బుధవారం మోటారు పడవ మునిగిపోవడంతో సుమారు 86 మంది మరణించారు. సామర్థ్యానికి మించిన బరువుతో ప్రయాణించడం వల్ల ఈ పడవ మునిగిపోయిందని వాదిస్తున్నారు.