సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 21:33:17

కరోనా ఎఫెక్ట్ తో దివాళా తీస్తున్న కంపెనీలు

కరోనా ఎఫెక్ట్ తో దివాళా తీస్తున్న కంపెనీలు

వాషింగ్ టన్ : అమెరికాకు చెందిన దిగ్గజ రిటైల్ సంస్థ లార్డ్ అండ్ టేలర్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వర్జీనియాలోని ఈస్టర్న్ కోర్టులో దివాలా రక్షణకు కంపెనీ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా వివిధ రంగాలు, పెద్ద ఎత్తున కంపెనీలు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటున్నప్పటికీ డిమాండ్ లేమి కనిపిస్తున్నది. కరోనా వల్ల చిన్న చిన్న కంపెనీల నుంచిపెద్ద సంస్థల వరకు మూతబడటం లేదా మరోరకంగా దెబ్బతినడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ అమెరికన్ రిటైల్ దిగ్గజం కూడా బ్యాంక్ రప్టసీ కోసం దరఖాస్తు చేసింది. అమెరికాలో వివిధ బ్రాండ్స్ భారీగా దెబ్బతిన్నాయి.

కరోనా కారణంగా దివాలా తీసిన పలు రిటైల్ సంస్థల జాబితాలో లార్డ్ అండ్ టేలర్ చేరింది. బ్రూక్స్ బ్రదర్స్, బర్నేస్ న్యూయార్క్ సహా ఎన్నో సంస్థలు దివాళా తీశాయి. 1826 మూలాలు కలిగిన ఈ డిపార్టుమెంటల్ స్టోర్ కరోనాకు ముందు నుంచి ఇబ్బందుల్లో ఉంది. కరోనాతో మరింత కుదేలైంది. దాదాపు రెండు శతాబ్దాల క్రితం మన్‌హటన్ డ్రై గూడ్స్ స్టోర్‌గా లార్డ్ అండ్ టేలర్ ప్రారంభమైంది. గత ఏడాది ఫ్రాన్స్ రెంటల్ క్లాతింగ్ రెంటల్ స్టార్టప్ కంపెనీ లీ-టోటే ఇంక్ ఈ సంస్థను 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

ఇప్పుడు ఈ రెండు సంస్థలు వేర్వేరుగా దివాలా పిటిషన్ దాఖలు చేశాయి. ఇప్పుడు లార్డ్ అండ్ టేలర్ కొనుగోలుదారుల కోసం చూస్తోంది. కరోనాకు ముందు న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూలో కంపెనీ 11 అంతస్తుల భారీ భవనాన్ని కూడా విక్రయించింది. సూట్లకు డిమాండ్ పడిపోవడంతో మెన్స్ వేర్ హౌస్, జోస్ ఎ బ్యాంక్ స్టోర్స్ వంటి బ్రాండ్స్ మాతృసంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కష్టాలు మరింతగా పెరిగాయి. దీంతో దివాళాకు దారి తీసింది. దాదాపు అమెరికా అధ్యక్షులందరికీ దుస్తులు అందించిన బ్రూక్స్ అండ్ బ్రదర్స్ కూడా దివాలా పిటిషన్ వేసింది.logo