వాషింగ్టన్: ‘అమెరికా స్వేచ్ఛకు కమ్యూనిజం ఒక ప్రాణాంతక ముప్పు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, పెర్ల్ హార్బర్‌పై దాడి, 9/11 ఉగ్రదాడుల కంటే అత్యంత పెద్ద ముప్పు’ అని అధ్యక్షుడు ట్రంప్ అమెరికా 250వ స్వాతంత్య్రదిన సంబరాల్లో వ్యాఖ్యానించారు. మౌంట్ రష్మోర్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ తొలుత అమెరికా విశిష్టతను కొనియాడారు.
తర్వాత అమెరికాకు కమ్యూనిజం ముప్పు ఉందని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు 1950 నాటి కమ్యూనిస్టుల వేట రోజులను గుర్తుకు తెచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. కాగా అమెరికాలో వడగాల్పులు పలు ప్రాంతాల్లో వేడుకలకు ఆటంకం కలిగించాయి.