వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు కొలరాడో కోర్టు షాకిచ్చింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021లో కేపిటల్ భవనంపై జరిగిన దాడి కేసులో ట్రంప్ ప్రమేయాన్ని నిర్ధారించి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా అతని పేరును బ్యాలెట్లోంచి తొలగించాలని ఆదేశించింది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం.