బీజింగ్: చైనా శాస్త్రవేత్తలు టమాటాలకు మరింత తియ్యదనం వచ్చేలా చేశారు. సుగర్ కంటెంట్‌ను నియంత్రించే రెండు జన్యువులను తొలగించడం ద్వారా దీన్ని సాధించారు. తాము పరివర్తన చేసిన టమాటాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, తాము ప్రయోగాలకు ఉపయోగించిన టమాటాల్లో ఉన్నదాని కన్నా 30% ఎక్కువని చెప్పారు.
బరువు, దిగుబడి యథాతథంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ కొత్త రకం టమాటాలు సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానున్నాయి.