Jack Ma | అలీబాబా వ్యవస్థాపకుడు (Alibaba founder), చైనా కుబేరుడు జాక్ మా (Jack Ma) చాలా కాలం తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) ఆగ్రహానికి గురై దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన.. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి చివరిలో చైనా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కొత్త కెరీర్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్ (visiting professor)గా పనిచేయనున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
తమ కళాశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ (visiting professor)గా చేరాలని జాక్‌మా (Jack Ma)ను ఆహ్వానించినట్లు జపాన్ (Japan)లోని టోక్యో విశ్వవిద్యాలయం (University of Tokyo) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జాక్‌మా నియామకం గడువు అక్టోబర్ చివరి నాటికి ముగుస్తుందని తెలిపింది. అయితే దీనిని వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించవచ్చని ప్రకటనలో వెల్లడించింది.
టోక్యో కళాశాల (Tokyo College)లో జాక్‌మా ముఖ్యమైన పరిశోధనాంశాలపై సలహాలు ఇవ్వడం, నిర్వహణ, బిజినెస్ స్టార్టప్‌లపై విద్యార్థులకు తరగతులు చెప్పడం వంటివి చేయనున్నారు. కాగా, జాక్‌మా పనిచేయనున్న ఈ కళాశాల.. టోక్యో విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ పరిశోధన సంస్థలకు మధ్య ఇంటర్ఫేస్గా పనిచేసేందుకు 2019లో ఏర్పాటు చేశారు.
Also Read..
Siddipet | సిద్దిపేటలో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
Anand Mahindra | ఆ సినిమా తీయాలని రాజమౌళికి ఆనంద్ మహీంద్రా సూచన.. దర్శకధీరుడి రిప్లై ఇదీ
Tamil Nadu | విషాదం.. వేడివేడి రసంలో పడి విద్యార్థి మృతి