e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News 996 Formula : ఆ ఫార్ములా చట్టవిరుద్ధం : చైనా సుప్రీంకోర్టు

996 Formula : ఆ ఫార్ములా చట్టవిరుద్ధం : చైనా సుప్రీంకోర్టు

బీజింగ్‌ : చైనాలోని అత్యున్నత ప్రజా న్యాయస్థానం కార్మికుల సంక్షేమంపై పరిశ్రమలకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అధిక పని విషయంలో దేశంలోని అన్ని పెద్ద కార్పొరేషన్లు తమ విధానాలు మానుకోవాలని హితవుపలికింది. ఇకపై 996 ఫార్ములా (996 Formula) ప్రకారంగా నడుచుకోవాలనుకోవడం చట్టవిరుద్ధం కిందకు వస్తుందని తేల్చింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను చైనా ప్రభుత్వం కూడా సమర్ధించడంతో.. అక్కడి బడా కంపెనీలో ఇరుకున పడిపోయాయి. చైనాలోని చాలా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగులతో ఎక్కువ పని చేయిస్తున్నారని, ఫలితంగా వేధింపుల కేసులు నిరంతరం పెరుగుతున్నాయని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఉద్యోగంలో ఉంచి చనిపోయిన 10 మంది ఉద్యోగుల కేసుల కేస్ స్టడీ ఆధారంగా సుప్రీం కోర్టు, చైనా మానవ వనరుల శాఖ ఈ ఉత్తర్వులు ఇచ్చాయి. ఇకపై ఇలా చనిపోయిన వారికి కంపెనీ ఇచ్చే పరిహారం మొత్తాన్ని పెంచాలని కూడా తెలిపారు. పని అధిక ఒత్తిడి చట్టవిరుద్ధమని కూడా కోర్టు పరిగణించింది. ఈ విషయాన్ని చైనాలోని అన్ని కంపెనీలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

ఫార్ములా 996 తో అనారోగ్యం

- Advertisement -

చైనాలో ఉత్పాదకతను పెంచడంలో ప్రైవేట్, టెక్నాలజీ కంపెనీల పాత్ర చాలా ఉన్నది. ఈ పరిశ్రమల్లో పాటిస్తున్న 996 ఫార్ములా దేశంలోని యువతను అనారోగ్యంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నది. అలీబాబా వంటి అనేక కంపెనీలు ఇప్పటికీ 996 ఫార్ములాను సమర్థిస్తున్నాయి. 996 ఫార్ములా అంటే వారంలో ఆరు రోజులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయడం. అది కూడా ఓవర్ టైం పే లేకుండా పనిచేయడం.

వరుసగా 110 గంటలు ఆఫీసులో ఉండి మానసిక అనారోగ్యానికి గురయ్యానని ఓ వీడియో గేమ్ డిజైనర్ తెలిపారు. తాను వరుసగా 110 గంటలపాటు పనిచేస్తూ ఆఫీసులో చాలాసార్లు గడిపానని చెప్పాడు. కఠినమైన పని, టార్గెట్‌ కారణంగా 31 ఏండ్ల వయస్సులో మానసిక అనారోగ్యానికి గురయ్యానని ఆయన తెలిపాడు.

ఇలాఉండగా, ఉద్యోగ ఒప్పందం చేసుకునే సమయంలో కంపెనీల యజమానులు ఇటువంటి పని గంటలను పేర్కొనరు. ఇప్పుడు సుప్రీంకోర్టు, ప్రభుత్వం కూడా కలుగజేసుకుని అధిక పనిగంటలను తొలగించి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని సూచిస్తున్న ప్రస్తుతం తరుణంలో.. చైనాలో ఇకపై ఉత్పత్తి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందేనంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇక కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

పెండ్లి పందిరిలో పుషప్స్‌.. వావ్‌ గ్రేట్‌!

మోడెర్నా వ్యాక్సిన్‌తో ఇద్దరు మృతి

కొవిడ్ మార్గదర్శకాలు సెప్టెంబర్‌ 30 వరకు పొడగింపు

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్‌ఓ అభినందన

అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం

చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్‌ డయనా విడాకులు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement