China on Corona | వింటర్ ఒలింపిక్స్ కోసం డ్రాగన్ జాగ్రత్తలు.. కరోనా నియంత్రణకు చర్యలు
China on Corona | వింటర్ ఒలింపిక్స్ కోసం చైనా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది.

China on Corona | ఒక్క కరోనా కేసు నమోదైనా డ్రాగన్ ఉలికి పడుతోంది. కఠిన ఆంక్షలు విధిస్తూ లాక్డౌన్ అమలు చేసేందుకు పూనుకుంటున్నది. ఇటీవల పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో కఠిన నిబంధనల అమలుకు పూనుకున్నది. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందుల పాలవ్వకుండా నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నది. నిత్యావసర వస్తువుల సరఫరాలో అవాంతరాల్లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జారీ చేసిన ఆదేశాలు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ వెబ్సైట్లో దర్శనం ఇచ్చాయి.
వచ్చే ఏడాది జరిగే వింటర్ ఒలింపిక్స్కు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండాలనే చైనా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. సోమవారం చైనాలో 92 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత సెప్టెంబర్ నుంచి అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- corona
- winter olympics
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

