బీజింగ్ : అంతరిక్షంలో తొలి సౌర విద్యుత్ ప్లాంట్ను చైనా నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రాధమిక దశలో ఉండగా నిర్ధేశిత లక్ష్యం కంటే రెండేండ్లు ముందుగానే 2028 నాటికి దీన్ని లాంఛ్ చేసే దిశగా బీజింగ్ వేగంగా అడుగులు వేస్తోంది. సౌర ఇంధనాన్ని విద్యుత్, మైక్రోవేవ్లుగా మార్చే ఉద్దేశంతో సోలార్ స్పేస్ స్టేషన్కు చైనా ప్రణాళికలు రూపొందిస్తోంది.
కక్ష్యలో ఉపగ్రహాలు తిరిగే శక్తిని అందించేందుకు వీటిని వాడేందుకు కసరత్తు సాగిస్తోంది. వైర్లెస్ ఇంధన తరలింపు వ్యవస్ధ ద్వారా ఎనర్జీ బీమ్లను భూమికి మళ్లించనుంది. ప్రతిపాదిత సోలార్ స్టేషన్ సౌర ఇంధనాన్ని భూమికి తరలించే సామర్ధ్యం కలిగిఉంటుంది. ఈ దిశగా చైనా ప్రాధమిక దశల్లో విజయవంతంగా ప్రయోగాలను చేపట్టింది.
ఈ పవర్ ప్లాంట్ 10 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిఉంటుంది. ఇక ఇదే తరహా పవర్ ప్లాంట్ను జిదియన్ యూనివర్సిటీ విద్యార్ధులు, పరిశోధకులు ఏర్పాటు చేశారు. 75 మీటర్ల ఎత్తులో పొడవైన నిర్మాణంతో సౌర శక్తి శ్రేణులను చూసే ఐదు ఉపవ్యవస్థలతో ఇది ఏర్పాటైంది . 2014లో ఆవిష్కరించబడిన అంతరిక్షం నుండి సౌరశక్తిని ఉత్పత్తి చేసే ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టు ముందుకొచ్చింది.