పాకిస్తాన్లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై చైనా స్పందించింది. పాక్‌లోని రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, దేశాభివృద్ది కోసం పాటుపడతాయని తాము భావిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ పక్షాలన్నీ కలిసి, దేశ అభివృద్ధి, సుస్థిరతకు బాటలు వేయాలని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసంపై ప్రశ్నించగా.. ఆయన పై విధంగా బదులిచ్చారు.
ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్నది మా విధానం. పాక్ మా స్నేహపూర్వక మిత్ర దేశమే. అక్కడి రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నాం. ఇలా ఏకతాటిపైకి వచ్చి.. దేశాన్ని సుస్థితర దిశగా తీసుకెళ్లాలన్నది మా అభిమతం అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ పేర్కొన్నారు.