China Covid deaths | కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. ఇటీవల జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీని సడలించడంతో వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనా జనాభాలో 60 శాతం మంది, ప్రపంచ జనాభాలో 10 శాతం మందికి కొవిడ్ సోకే ప్రమాదం ఉందని అంటువ్యాధుల నిపుణులు అంచనావేస్తున్నారు. ఇదే సమయంలో చైనాలో కరోనా కారణంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రధాన నగరాల్లో శ్మశానవాటికలు మృతదేహాలతో కిక్కిరిపోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే, డ్రాగన్ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తోంది. మరణాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అక్కడ కొవిడ్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని చెప్తోంది. వైరస్ కారణంగా మరణాలను నమోదు చేయడానికి ఉపయోగించే ప్రమాణాలను మార్చిన తర్వాత ఈనెల 20న కరోనా వల్ల ఒక్కరుకూడా మరణించలేదని చైనా ప్రభుత్వం బుధవారం తెలిపింది. వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ వైఫల్యంతో నేరుగా మరణించే వారిని మాత్రమే కొవిడ్ మరణ గణాంకాల కింద లెక్కిస్తారు. వైరస్ ఇతర ప్రభావాల కారణంగా సంభవించే మరణాలను ఇకపై కరోనా లెక్కల్లోకి రాబోవన్నమాట.
అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాజధాని బీజింగ్‌లో సోమవారం రెండు, మంగళవారం ఐదు కరోనా మరణాలు సంభవించాయి. అయితే వాస్తవానికి మరణాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. బీజింగ్‌లోని కొన్ని శ్మశాన వాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అక్కడి ఆసుపత్రులు, శ్మశానవాటికల వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్టు చూపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కొవిడ్ మరణాలను దాచే ప్రయత్నం చేస్తోన్న డ్రాగన్‌పై వైద్య నిపుణులు మండిపడుతున్నారు.
चीन में कोरोना से मचा फिर से हाहाकार
– अस्पतालों में बेड नही,दवाइयाँ खत्म हो रही है और शव रखने की जगह नही|
– आशंका है कि 90 दिन में चीन की 60% आबादी कोरोना से संक्रमित होगी, लाखों मौतों की आशंका| pic.twitter.com/Tp4DiaU83g
— Shubhankar Mishra (@shubhankrmishra) December 21, 2022
#China experiencing an increase in #Covid deaths. Officials are trying to hide the true impact of their sudden shift from Covid zero 🇨🇳 This makes social media snapshots an important tool to assess the extent of China’s worst-ever Covid epidemic.pic.twitter.com/s94DE9eZZQ https://t.co/G7Br4a8YRi
— Share_Talk ™ (@Share_Talk) December 21, 2022
China officially announced the deaths of a total of two Covid patients across the country today.
This video was made in #Henan on 19th Dec and shows wrapped bodies of Chinese people where relatives are pretty certain the deaths were caused by Covid.#ChineseCovidDeaths #China pic.twitter.com/8ravK1Axyj— Satyaagrah (@satyaagrahindia) December 21, 2022
Many dead bodies are seen on the floor of #China's hospital, around which some people are crying and some people are being treated.
According to official #Chinese sources, allegedly, only five people died of COVID in China yesterday.#China #ChineseCovidDeaths #COVID pic.twitter.com/0upAujwlzL
— Chaudhary Parvez (@ChaudharyParvez) December 20, 2022