China | అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందన్న ట్రంప్.. తీవ్రంగా ఖండించిన చైనా
China | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా(China) ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.
చైనా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా(China) ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించడానికి చైనా భారీ డేటా హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ ట్రంప్ చేసిన వాదనలు ఆధారం లేనివి, దురుద్దేశపూర్వకమైనవి అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తాము అమెరికా ఎన్నికల్లో ఎప్పుడు తలదూర్చలేదని, భవిష్యత్‌లోను జోక్యం చోసుకోమని చైనా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తప్పుడు ఆరోపణలతో అమెరికా చైనాను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. వారి దేశంలో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఆసక్తి ఏమాత్రం లేదని చైనా స్పష్టం చేసింది.
కాగా, అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో డ్రాగన్ దేశం చైనా జోక్యం చేసుకున్నట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నదని, అమెరికా ఓటింగ్ విధానం తీవ్ర ప్రభావానికి గురైందని, అయితే ఓటర్లను మార్చిన అంశంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల ఫలితాలను కూడా మార్చినట్లు ట్రంప్ నేరుగా పేర్కొనలేదు. వైట్‌హౌజ్ నుంచి ఆయన మాట్లాడుతూ.. ఓటింగ్ ఫ్రాడ్ జరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
కానీ దానికి సంబంధించిన ఆధారాలను మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్, బ్యాలెట్ కౌంటింగ్ వ్యవస్థల్లో అక్రమాలు జరిగినట్లు వైట్‌హౌజ్ సుమారు నాలుగు సెక్షన్ల డాక్యుమెంట్లను రిలీజ్ చేసింది. అమెరికా ఓటరు డేటాను చైనా దుర్వినియోగం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని చైనా ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Joe Biden
- trump
- US ELECTIONS
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

